Homeజిల్లాలునిజామాబాద్​BC JAC | బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్​గా పోతన్​కర్ లక్ష్మీనారాయణ నియామకం

BC JAC | బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్​గా పోతన్​కర్ లక్ష్మీనారాయణ నియామకం

BC JAC | బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్​గా ​ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని గీతాభవన్​లో సోమవారం బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC JAC | బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ Pothankar Lakshminarayana నియమితులయ్యారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని గీతాభవన్​ (Geeta Bhavan) లో సోమవారం (అక్టోబరు 13) బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు.

అన్ని కమిటీల సూచన మేరకు లక్ష్మీనారాయణను బీసీ ఐకాస జిల్లా ఛైర్మన్​ (Chairman) గా నియమించారు. కో ఛైర్మన్​గా బొబ్బిలి నర్సయ్య నియమితులయ్యారు.

BC JAC | రాష్ట్ర కమిటీ సూచన మేరకు..

రాష్ట్ర కమిటీ ఛైర్మన్​ R కృష్ణయ్య, వర్కింగ్ ఛైర్మన్​ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వీరిరువురిని నియమించినట్లు ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో బీసీ ఉద్యమానికి ఈ జేఏసీ పునాది కాబోతుందన్నారు.

త్వరలో ప్రతి కుల సంఘం నుంచి ఒక ప్రతినిధిని కో కన్వీనర్​గా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగరాజ్, సభ్యులు పాల్గొన్నారు.