అక్షరటుడే, ఇందూరు: Independence Day celebrations | జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ వేడుకలకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ (BC Commission Chairman Niranjan) ముఖ్యఅతిథిగా రానున్నారని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Independence Day celebrations | వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున..
స్థానిక పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు (Waterproof tents) వేయించాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని, 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఆయా శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథితులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.
Independence Day celebrations | సాంస్కృతిక కార్యక్రమాలు..
జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడ కూడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశంసాపత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల పేర్లతో ప్రతిపాదనలు పంపించాలన్నారు.