అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ఉద్దేశించిన బిల్లును శాసనమండలి సోమవారం ఆమోదించింది. అలాగు, మరో మూడు కీలక బిల్లులకు సైతం ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం మండలి సమావేశం కాగానే పంచాయతీరాజ్ మంత్రి సీతక్క(Minister Seethakka) మండలిలో ప్రవేశపెట్టారు.
అలాగే పంచాయితీరాజ్ రెండో సవరణ బిల్లు 2025, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లులకు ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టింది. అయితే, కాళేశ్వరం అవకతవకలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు(BRS Members) సభలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు యత్నించారు. వారి నిరసనల మధ్యే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Board Chairman Gutta Sukhender Reddy) బిల్లుల ఆమోద ప్రక్రియ చేపట్టారు. మూజు వాణితో బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించిన మండలిని నిరవధింకంగా వాయిదా వేశారు.
BC Reservations | బీఆర్ఎస్ నిరసనలు..
బీసీ బిల్లులకు ఆమోదం కోసం సమావేశమైన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళేశ్వరం నివేదిక(Kaleshwaram Report) ప్రతులను చించి పోడయంపై విసిరేశారు. రాహుల్‌కు సీబీఐ వద్దు, రేవంత్‌కు సీబీఐ ముద్దు, రాష్ట్రాన్ని బాగుచేస్తే సీబీఐ కేసులా.. సిగ్గుసిగ్గు, బడేభాయ్.. చోటేభాయ్ ఏక్ హై.. అంటూ నినాదాలు చేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసనల మధ్యే మండలి చైర్మన్ గుత్తా బిల్లులను ఆమోదం కోసం ప్రక్రియ చేపట్టారు. మూజువాణి ఓటు(Moojuvani Vote) ద్వారా బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం మండలి నిరవధికంగా వాయిదా పడింది.
BC Reservations | బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఫైర్
శాసనమండలిలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ(Jai Telangana) నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో టీఆర్ఎస్ బంధం తెగిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టీఆర్ఎస్‌కు తెలంగాణ మాట పలికే అర్హత కోల్పోయిందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
BC Reservations | ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి
మరోవైపు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించే బిల్లులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC)ల నిరసనలపై అసంతృప్తి వ్యక్త ంచేశారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుంటే అడ్డుకోవద్దని కోరారు. బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి సహకరించాలని సూచించారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన చాలా మంది బీసీలకు ఇబ్బందికరంగా మారిందని, ఆ నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.