Homeజిల్లాలుకామారెడ్డిBC Bandh | బీసీ బంద్.. ఉమ్మడి జిల్లాలో అన్నివర్గాల మద్దతు ​ ​

BC Bandh | బీసీ బంద్.. ఉమ్మడి జిల్లాలో అన్నివర్గాల మద్దతు ​ ​

ఉమ్మడి జిల్లాలో బీసీ బంద్​ సందర్భంగా వ్యాపార సంస్థలు, పాఠశాలలను మూసివేశారు. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు కదలకుండా బీసీ సంఘాల నాయకులు ధర్నాకు దిగారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ ​: BC Bandh | బీసీ రిజర్వేషన్లను(Bc Reservations) అమలు చేయాలనే డిమాండ్​తో​ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ‘బీసీ తెలంగాణ బంద్’ ఉమ్మడిజిల్లాలో విజయవంతంగా సాగుతోంది. నిజామాబాద్​ జిల్లాలో వ్యాపార సంస్థలు, పాఠశాలలను మూసివేశారు.

బీసీ సంక్షేమ సంఘం(Bc Sankshema Sangham) ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నగరంలోని బస్​డిపో ఎదుట బస్సులు బయటకు రాకుండా ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ ఆధ్వర్యంలో ప్రతినిధులు నగరంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. పలు వ్యాపార సంస్థల యజమానులకు బీసీ రిజరేషన్ల అత్యవసరాన్ని వివరించారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్​ డిపో ఎదుట నిరసన

BC Bandh | ఆర్టీసీ డిపో ఎదుట..

బీసీ జేఏసీ(BC JAC) ఆధ్వర్యంలో ఆల్​పార్టీ ఆధ్వర్యంలో బస్​డిపో ఎదుట ఆందోళన చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​, టీపీసీసీ కార్యదర్శి రాంభూపాల్​, కాంగ్రెస్​ ప్రతినిధులు పంచరెడ్డి చరణ్, సీనియర్​ జర్నలిస్ట్​ జమాల్​పూర్​గణేష్​, బీసీ జేఏసీ కన్వీనర్​ పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, మాజీ జడ్పీ ఛైర్మర్​ దాదన్నగారి విఠల్​రావు, పీడీఎస్​యూ ప్రతినిధి సుధాకర్​, ఎనుగందుల మురళి, సీపీఐ ప్రతినిధి సుధాకర్​, ఓమయ్య, ఏఐఎస్​ఎఫ్​ రఘురాం, యెండల ప్రదీప్​, బీజేపీ ప్రతినిధులు స్వామి యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.​

నిజామాబాద్​ నగరంలోని ఆర్టీసీ డిపో ఎదుట బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న నాయకులు

నిజామాబాద్​ నగరంలో మూసిఉన్న ఆర్టీసీ డిపో

నగరంలో ఓ స్కూల్​ బస్సును నిలిపివేసి బీసీ బంద్​ విషయాన్ని వివరిస్తున్న ఆల్​​పార్టీ ప్రతినిధులు

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్​లో నిలిచిపోయిన బస్సులు

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలో బైక్​ ర్యాలీ

ఇందల్వాయిలో అన్నిపార్టీల ఆధ్వర్యంలో నిరసన

కోటగిరిలో..