అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | జిల్లాలో ఈనెల 18 బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) తెలిపారు. నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై (BC Reservations) అగ్రవర్ణాలు కోర్టులో కేసు వేసి నిలిచిపోయేలా చేయడంపై.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీ అగ్రనేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు వ్యాపారస్తులు విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రసాద్, పోల్కం గంగా కిషన్, రవీందర్, దేవేందర్, శంకర్, బాలన్న, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.