అక్షరటుడే, ఇందూరు: Bc Sankshema Sangham | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను (BC reservation) కోరుతూ ఈనెల 18న తలపెట్టిన బీసీబంద్ను విజయవంతం చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) (TRSMA), హోల్సేల్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ (Wholesale Cloth Merchants Association) ప్రతినిధులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది అగ్రవర్ణాల వారు బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి రిజర్వేషన్లను నిలిపివేయడం జరిగిందన్నారు. దీంతో రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
కావున అన్నివర్గాల వ్యాపారస్తులు, విద్యాసంస్థలు తమకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంగా కిషన్, దేవేందర్, శంకర్, శ్రీలత, బాలన్న, విజయ్, సాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.