Homeజిల్లాలుకామారెడ్డిBC Bandh | కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బీసీ బంద్​

BC Bandh | కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బీసీ బంద్​

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్​తో జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి బంద్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలు బంద్​ పాటించాయి.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: BC Bandh | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రధాన డిమాండ్​తో జేఏసీ (BC JAC) ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి బంద్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 5 గంటలకే జేఏసీ నాయకులు బస్టాండ్ ముందు భైఠాయించారు.

బస్టాండ్ (Kamareddy Busstand) నుంచి బస్సులు బయటకు రాకుండా ఒకవైపు కుర్చీలు అడ్డుపెట్టి మరోవైపు జేఏసీ నాయకులు కూర్చున్నారు. దాంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న ప్రజలు బస్టాండ్​లోనే ఉండిపోయారు. బస్సులు బయటకు వెళ్లకపోవడంతో ప్రైవేట్ వాహనాలు బస్టాండ్ ఎదుట క్యూకట్టాయి. సాధారణ ఛార్జీ కంటే అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

మరోవైపు బంద్ సందర్భంగా వైద్యసేవలు మినహా వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఇతర దుకాణాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. దాంతో కామారెడ్డి (Kamareddy) పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. బంద్​ను పురస్కరించుకుని జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా (Nizamsagar Chowrastha) వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ’మేమెంతో మాకంత.. బీసీ మేలుకో.. రాష్ట్రాన్ని ఏలుకో’ అంటూ నినాదాలు చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్​ ఎదుట శనివారం తెల్లవారుజామున జేఏసీ నాయకుల నిరసన

పట్టణంలో బంద్​ పాటిస్తున్న వ్యాపారసంస్థలు

బస్టాండ్​లో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుగా పెట్టిన కుర్చీలు

బస్సులు నడవకపోవడంతో బస్టాండ్​లో వేచిఉన్న ప్రయాణికులు

గాంధారిలో..

పెద్దకొడప్​గల్​లో..