Homeక్రీడలుIND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్ England అద్భుతంగా పుంజుకుంది. నాలుగో టెస్టు రెండో రోజు టీమిండియా (Team India) పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

మొదట భారత్‌ను 358 పరుగులకు ఆలౌట్ చేసింది ఆతిథ్య జ‌ట్టు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిపోయింది. బజ్‌బాల్ ఆటతీరు చూపిన ఇంగ్లండ్, ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.

ఓపెనర్లు బెన్ డకెట్ Ben Duckett (100 బంతుల్లో 94; 13 ఫోర్లు), జాక్ క్రాలీ (113 బంతుల్లో 84; 13 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 166 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపునకు మళ్లించారు. ఆ తర్వాత బెన్ డకెట్‌ను అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ అవుట్ చేయగా, క్రాలీని రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో ఓలీ పోప్ (16 బ్యాటింగ్), జో రూట్ (0 బ్యాటింగ్) ఉన్నారు.

IND vs ENG : దుమ్ము రేపారు..

264/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషభ్ పంత్ 54 (75 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు), యశస్వి జైస్వాల్ 58 (107 బంతుల్లో, 10 ఫోర్లు, 1 సిక్స్), సాయి సుదర్శన్ 61 (151 బంతుల్లో, 7 ఫోర్లు) రాణించ‌డంతో భార‌త్ మంచి స్కోరు చేసింది.

ఇంగ్లండ్ బౌలర్లలోబెన్ స్టోక్స్ 5 వికెట్లు తీసుకోగా, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్, లియమ్ డాసన్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో కీలక మలుపు ఏంటంటే.. జడేజా Jadeja (20) రెండో రోజు ఆరంభంలోనే ఔట్ కావ‌డం భార‌త్‌కి పెద్ద దెబ్బ ప‌డింది.

శార్దూల్ ఠాకూర్ (41), వాషింగ్టన్ సుందర్ (27) కలిసి మోస్త‌రు భాగస్వామ్యం న‌మోదు చేశారు. రిషభ్ పంత్ Rishabh Pant హాఫ్ సెంచరీతో పోరాడినా, ఆర్చర్ డెలివరీకి బౌల్డ్ అయ్యాడు. ఇక‌ భార‌త్ చివరి మూడు వికెట్లు త్వరగా కోల్పోయింది.

ఇంగ్లండ్ మాత్రం బ్యాటింగ్‌లో దుమ్ము రేపింది. తొలి ఓవర్‌ నుంచే దూకుడుగా ఆడారు. టీ బ్రేక్ సమయానికి 14 ఓవర్లలో 77/0 కాగా, 28.4 ఓవర్లలోనే 150 పరుగులు పూర్తయ్యాయి. మూడో రోజు మ‌రింత దూకుడుగా ఆడి భార‌త్‌ని మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉండ‌గా, మూడో రోజు తొలి సెషన్ మ్యాచ్ దిశను నిర్ణయించనుంది.