HomeతెలంగాణYoutuber Sunny Yadav | అంతర్జాతీయ బైక్‌ రైడర్ భ‌య్యా సన్నీ యాద‌వ్ అరెస్ట్.. ఇటీవ‌లే...

Youtuber Sunny Yadav | అంతర్జాతీయ బైక్‌ రైడర్ భ‌య్యా సన్నీ యాద‌వ్ అరెస్ట్.. ఇటీవ‌లే పాకిస్తాన్ టూర్ వెళ్లిన యూట్యూబ‌ర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Youtuber Sunny Yadav | ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Sunny yadav) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం అంద‌రికి తెలిసే ఉంటుంది. ఆయ‌న బైక్‌పైనే అంతర్జాతీయంగా ప‌లు టూర్స్ వేస్తుంటాడు. అయితే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేస్తున్నాడని నూతనకల్ పీఎస్‌(Nutanakal PS)లో ఇది వరకే కేసు నమోదైంది. స‌న్నీ యాద‌వ్‌ను నేష‌నల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(NIA) అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ బైక్ టూర్‌ను పూర్తి చేసి ఇండియాకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు (Police Arrest) చేశారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Youtuber Sunny Yadav | మ‌రో అరెస్ట్..

పాకిస్తాన్ టూర్(Pakistan Tour) వివరాలను ఎన్ఐఏ అధికారులు సేక‌రిస్తున్నారు. భయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌(Online Betting App)లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(TGRTC MD VC Sajjanar) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో భ‌య్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంత‌ర్జాతీయ రైడ‌ర్‌కి సూర్యాపేట జిల్లా పోలీసులు లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్ల విషయంలో ఈ ఏడాది మార్చి 5న సూర్యాపేట జిల్లా Suryapet నూతనకల్‌ పోలీసు స్టేషన్‌లో సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది.

కాగా సన్నీ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్‌గా ఉంటున్నాడు. బైక్ రైడ్ వీడియో(Bike Ride Video)లతో చాలా మంది సబ్‌స్క్రైబర్‌లను పొందుతూ డబ్బు గ‌ట్టిగానే ఆర్జిస్తున్నాడు. అయితే అతడు మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ నిర్వహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ Sajjanar ఆరోపించారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేశారు. నోటీసులు పంపిన తర్వాత అత‌ని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు(Lookout Notices) జారీ చేయడానికి ముందుకొచ్చారు.