Home ఆంధప్రదేశ్ Bay of Bengal Low Pressure | బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు వర్ష సూచన

Bay of Bengal Low Pressure | బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు వర్ష సూచన

0
Bay of Bengal Low Pressure | బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు వర్ష సూచన
Bay of Bengal Low Pressure | బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bay of Bengal Low Pressure | నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

తెలంగాణలో నవంబర్​లో వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. ఈ క్రమంలో మళ్లీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. 22న మధ్య, తూర్పు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 23-24 తేదీలలో హైదరాబాద్ (Hyderabad) నగరంతో సహా మధ్య, ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది.

Bay of Bengal Low Pressure | ఈ జిల్లాల్లో..

ఉమ్మడి మెదక్​ (Medak), నిజామాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్​, ఖమ్మం జిల్లాలో పాటు నాగర్​ కర్నూల్​, భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాలో మోస్తరు జల్లులు (Moderate Rains) కురుస్తాయి. అయితే ఈ వర్షాలు అంతటా ఉండవు. అక్కడక్కడ మాత్రమే పడుతాయి. పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసే అవకాశం ఉంది.

Bay of Bengal Low Pressure | ఏపీలో..

అల్పపీడన ప్రభావంతో ఆది, సోమవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.