అక్షరటుడే, బోధన్: Bathukamma | ఎడపల్లి మండలంలో (Yedapally Mandal) బతుకమ్మ సంబురాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని దేశ్ముఖ్ల ఆధ్వర్యంలో బతుకమ్మను తీరొక్క పూలతో అందంగా పేర్చారు.
అనంతరం వాటిని స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఎడపల్లి సంస్థానం దేశ్ముఖ్ల పాలనలో ఉన్నప్పటి నుంచి దసరా పండుగ (Dussehra festival) తర్వాతే బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఆనవాయితీ వస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీంట్లో భాగంగానే శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.