Homeజిల్లాలునిజామాబాద్​MLA Dhanpal | బతుకమ్మ ఘాట్ పరిశీలన

MLA Dhanpal | బతుకమ్మ ఘాట్ పరిశీలన

అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | నగరంలోని రఘునాథ చెరువు (బొడ్డమ్మ చెరువు)ను అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ఆదివారం నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్​తో కలిసి పరిశీలించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma)ను పురస్కరించుకొని నగరంలోని మహిళలు సోమవారం రఘునాథ చెరువుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఘాట్ వద్ద పరిశుభ్రత, విద్యుత్ దీపాలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో డీఈ సుదర్శన్ రెడ్డి, ఏఈ ఇనాయత్ అలీ, మాజీ కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News