Telangana University
Telangana University | మహిళల్లో ఐక్యతను పెంచేది బతుకమ్మ పండుగ

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | మహిళల్లో ఐక్యతను పెంచేది బతుకమ్మ పండుగ అని తెలంగాణ యూనివర్సిటీ వైస్​ఛాన్స్​లర్​ యాదగిరిరావు(Vice Chancellor Yadagiri Rao) పేర్కొన్నారు. వర్సిటీలో గురువారం ఉమెన్​ సెల్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ బ్రమరాంబిక ఆధ్వర్యంలో ఇంజినీరింగ్​ కళాశాల(Engineering College) ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య​ అతిథిగా హాజరైన వైస్​ఛాన్స్​లర్​ యాదగిరిరావు, రిజిస్ట్రార్​ యాదగిరి (TU Registrar Yadagiri) అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్​ఛాన్స్​లర్​ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ పండుగ ప్రకృతి సౌందర్యాన్ని, మహిళల ఐక్యతను, ప్రకృతి వనరుల సంరక్షణను సూచిస్తుందన్నారు.

రంగురంగు పూలతో గౌరమ్మను పేర్చి, తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో జరుపుకొని చివరిరోజు పూలను నీటిలో వదులుతారన్నారు. ఈ పండుగ స్త్రీల స్ఫూర్తికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల (Engineering College) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, డీన్ ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్లు శాంతాబాయి, వాణి, ప్రసన్న శీలా, రాజేశ్వరి, జ్యోతి, ఉమారాణి తదితర సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.