Homeజిల్లాలునిజామాబాద్​Bathukamma Sambaralu | పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Bathukamma Sambaralu | పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bathukamma Sambaralu | జిల్లా పోలీస్ శాఖ (Nizamabad Police) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు జిల్లాలోని ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

విధి నిర్వహణలో అనునిత్యం బిజీగా ఉండే పోలీసులు బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయిచైతన్య(CP Sai Chaitanya) తమతమ సతీమణిలతో పాటు వారి కుటుంబ సభ్యులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

చిన్నాపెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆడిపాడారు. దీంతో పోలీసు శాఖలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి(DCP Baswareddy), నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి(ACP Raja Venkata Reddy) నగరంలోని సర్కిల్ ఇన్​స్పెక్టర్లు, సబ్ ఇన్​స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సతీమణి.. సీపీ సాయిచైతన్య సతీమణి

Must Read
Related News