అక్షరటుడే, వెబ్డెస్క్ : Bathukamma Festival | తెలంగాణ వ్యాప్తంగా బతుమకమ్మ (Bathukamma) వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు.
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వాసులు సైతం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మలేషియా (Malaysia)లో ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న సాయంత్రం బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.
మలేషియా రాజధాని కౌలాలంపూర్ (Kuala Lumpur) బ్రిక్‌ఫీల్డ్స్‌లోని జలాన్ స్కాట్ బృందావన్ హాల్‌లో గల శ్రీ కృష్ణ ఆలయంలో బతుకమ్మ వేడుకలు జరపనున్నారు. ముఖ్య అతిథిగా పెరాక్ రాష్ట్ర శాసనసభ సభ్యురాలు వసంతీ సిన్నసామి హాజరు కానున్నారు.
వేడుకల్లో భాగంగా అందంగా బతుకమ్మ పేర్చిన వారికి గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించనున్నారు. అలాగే బతుకమ్మ తీసుకొచ్చిన మహిళలు అందరికి సిల్వర్ కాయిన్ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతులు అందిస్తామన్నారు. మలేషియాలో స్థిరపడ్డ తెలంగాణ వారు, భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.