- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Bathukamma | గిరిరాజ్​లో బతుకమ్మ సంబరాలు

Bathukamma | గిరిరాజ్​లో బతుకమ్మ సంబరాలు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Bathukamma | గిరిరాజ్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకులు విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను (Bathukammas) చేశారు. కళాశాల ప్రాంగణంలో ఆటపాటలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి (Principal Rammohan Reddy) మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ అని అన్నారు. ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పండుగ అని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, పీఆర్​వో దండు స్వామి, ఉమెన్ ఎంపవర్​మెంట్​ సెల్ కో–ఆర్డినేటర్ నహీదా బేగం, రజిత, నాగజ్యోతి, ప్రతిభ, నవీన, లావణ్య, శ్రీలేఖ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News