- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Ushodaya Degree College | ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Ushodaya Degree College | ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Ushodaya Degree College | పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను (Bathukamma celebration) ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి పద్మ (Child Welfare Officer Padma) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు (students) కృషి పట్టుదలతో చదువుకోవాలని..తద్వారా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఉద్బోధించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్​ గంగాధర్​ (College principal Gangadhar) మాట్లాడుతూ.. విద్యార్థి జీవితం పువ్వుల వలె రంగుల హరివిల్లు కావాలని ఆకాంక్షించారు. బతుకమ్మ ప్రాధాన్యతను వివరించారు.

- Advertisement -

కళాశాల ప్రతినిధులు రమణి సునీత దుష్యంత్, వెంకట రమణి మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఎదగాలని సూచించారు. ఫుడ్ ఫెస్టివల్​లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News