అక్షరటుడే, ఇందూరు: Bathukamma Sambaram | నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోటకు చేర్చి గౌరీదేవిని స్తుతిస్తూ మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు.
అన్నిశాఖల మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాలు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగులో బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడి నెలకొంది.
జిల్లా అధికారులు, ఉద్యోగులు, దాండియా కోలాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి(Mla Bhupathi reddy), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Mla Dhanpal), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.