అక్షరటుడే, ఇందూరు: Bathukamma Sambaram | ప్రభుత్వ ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో టీఎన్జీవోస్ (TNGOs) ఆధ్వర్యంలో ఉద్యోగులు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆయా శాఖల మహిళా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో అలరించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి(manala Mohan reddy) ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ముందుగా గౌరీదేవి పూజను సాంప్రదాయ బద్ధంగా చేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ టీఎన్జీవో అధ్యక్షుడు సుమన్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



