అక్షరటుడే, ఎల్లారెడ్డి: Saddula Bathukamma | సద్దుల బతుకమ్మ సంబురాలు ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy) మంగళవారం ఘనంగా జరిగాయి. మహిళలు తంగెడు, గునుగు, బంతి పూలతో బతుకమ్మలను పేర్చారు. ఒక్కేసి పువ్వేసి చందమామ.. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ మహిళలు పాటలు పాడారు.
Saddula Bathukamma | పూలను పేర్చి..
మహిళలు ఉదయం తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. పసుపుతో గౌరమ్మను (Gouramma) చేసి బతుకమ్మ ముందు పెట్టి పూజలు చేశారు. నైవేద్యాలను సమర్పించారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలు పెట్టి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్నారులు, యువతులు, మహిళలు కోలలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.