అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విదేశాల్లో బతుకమ్మ (Bathukamma) వేడుకలకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలు దేరారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. బతుకమ్మ సందర్బంగా చింతమడక, మంచిర్యాలలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ఆమెకు ఆహ్వానాలు అందాయి.
Kavitha | అనుమతిచ్చిన కోర్టు..
కవిత ప్రస్తుతం లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ఆమెకు అనుమతి మంజూరు చేసింది. దీంతో గురువారం సాయంత్రం ఆమె ఢిల్లీ (Delhi) నుంచి ఖతార్ వెళ్లనున్నారు. అంతకు ముందు కవిత హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకలకు హాజరవుతారు. శుక్రవారం ఖతార్లో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు.
Kavitha | మాల్టాలో..
కవిత ఈ నెల 27న మాల్టాకు చేరుకుంటారు. తెలంగాణ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 28న తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ వేడుకలకు హాజరు అవుతారు.