అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Bathukamma Sambaram | జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. రంగురంగుల పువ్వులను పేర్చి బతుకమ్మను తయారు చేసి వాటిచుట్టూ ఆడిపాడారు.
నగరంలోని స్నేహా సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ (Sneha Society for Rural Reconstruction) దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు గురువారం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్మన్ మాజీ ముక్కా దేవేంద్ర గుప్తా(Mukka Devendra Gupta) హాజరై ప్రసంగించారు. తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు.
స్నేహా సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలు జరుపుకునే పెద్ద పండుగని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో సొసైటీ సభ్యులు టీ వీరేశం, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.