అక్షరటుడే, ఇందూరు: Baswa laxmi narsaiah | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) ఆయా మోర్చాల రాష్ట్ర అధ్యక్షులను పార్టీ నియమించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Nadda) సోమవారం ప్రకటించారు.
కిసాన్ మోర్చా (Kisan Morcha) రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గంలో పనిచేశారు. ఈ సందర్భంగా బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.