Homeజిల్లాలునిజామాబాద్​Baswa Laxmi Narsaiah | కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా బాధ్యతల స్వీకరణ

Baswa Laxmi Narsaiah | కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, ఇందూరు: Baswa Laxmi Narsaiah | భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా (State Kisan Morcha) రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్​లోని (Hyderabad) పార్టీ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్​కు చెందిన సీనియర్ నాయకుడు లక్ష్మీనర్సయ్య జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Baswa Laxmi Narsaiah | రైతుల శ్రేయస్సుకు కృషి..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి, రైతుల శ్రేయస్సుకు పాటుపడతానని ఈసందర్భంగా బస్వా లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. వ్యవసాయంలో కేంద్రం అందిస్తున్న పథకాలను ముందుకు తీసుకెళ్తూ తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News