Kanchi Kamakoti | కంచి కామకోటి ఉత్తరాధికారిగా బాసర వేద పండితుడు
Kanchi Kamakoti | కంచి కామకోటి ఉత్తరాధికారిగా బాసర వేద పండితుడు

అక్షరటుడే, ఇందూరు: Kanchi Kamakoti : ఆది శంకరాచార్యులు Adi Shankaracharya స్థాపించిన కంచికామ కోటి పీఠం 2533 ఏళ్లుగా దక్షిణ భారతావనిలో ఆధ్యాత్మిక సౌరభాలు విరజిమ్ముతోంది. అయితే ఈ పీఠం ఉత్తరాధికారిగా బాసర ఆలయ ఋగ్వేద పారాయణుడు గణేష్ శర్మ సన్యాస దీక్ష తీసుకోనున్నారు.

ప్రస్తుతం 70వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న విజయేంద్ర సరస్వతి Vijayendra Saraswati తన ఉత్తరాధికారిగా గణేష్ శర్మను ఎంచుకున్నారు. అన్నవరానికి Annavaram చెందిన గణేష్ శర్మ రెండేళ్లుగా బాసర సరస్వతి ఆలయంలో ఋగ్వేద పండితుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్ 30, అక్షయ తృతీయ Akshaya Tritiya రోజు గణేష్ శర్మకు ఉత్తరాధికారిగా విజయేంద్ర సరస్వతి సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కంచి కామకోటి పీఠం ఒక ప్రకటనలో తెలిపింది. తరానికి ఒక్కరికి లభించే అరుదైన అవకాశం పొందిన గణేష్ శర్మ వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.