Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​ థర్డ్​ ఇయర్​ చదువుతున్న వసంత అనే విద్యార్థి బుధవారం హాస్టల్​లో ఉరి వేసుకుంది. మిగతా విద్యార్థులు క్లాస్​లకు వెళ్లగా వసంత ఒంటరిగా హాస్టల్​లో ఉంది. అనంతరం ఆమె ఉరి వేసుకొని తనువు చాలిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె స్వస్థలం వనపర్తి (Wanaparthy) జిల్లాగా గుర్తించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​ థర్డ్​ ఇయర్​ చదువుతున్న వసంత అనే విద్యార్థి బుధవారం హాస్టల్​లో ఉరి వేసుకుంది.

మిగతా విద్యార్థులు క్లాస్​లకు వెళ్లగా వసంత ఒంటరిగా హాస్టల్​లో ఉంది. అనంతరం ఆమె ఉరి వేసుకొని తనువు చాలిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె స్వస్థలం వనపర్తి (Wanaparthy) జిల్లాగా గుర్తించారు. వసంత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రి (Bhainsa Hospital)కి తరలించారు. కాగా క్యాంపస్​లో తరచూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో సైతం పలువురు విద్యార్థులు తనువు చాలించారు.

Basara IIIT Student | ప్రేమ వ్యవహారమేనా..

వసంత ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తోంది. ఆమె గణేశ్​ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. అయితే అతడు ఇటీవల తన స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే వసంత సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే వసంత ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత ఇవ్వాలంటూ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. వీసీ చాంబర్​ను ముట్టడించారు. దీంతో క్యాంపస్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ

నగరంలోని మెడికల్ కళాశాలలో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్​ కొరడా ఝలిపించింది. ఈ సందర్భంగా ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

KTR on Mallanna Jathara | దైవ దర్శనానికి వెళ్తే దాడి చేస్తారా : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో...

Medical Students Ground Demand | క్రీడామైదానం కోసం జూడాల డిమాండ్​.. జీజీహెచ్​లో నిరసన​

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Medical Students Ground Demand | శాశ్వత క్రీడామైదానం ఏర్పాటు చేయాలని జూనియర్​ డాక్టర్లు (JUDA Protest) డిమాండ్​ చేశారు....

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...