అక్షరటుడే, ఇందూరు: Basara | శృంగేరి శంకరమఠం (Sringeri Shankara Math) ఆధ్వర్యంలో బాసరలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రారంభోత్సవం, కుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్టిమిల్లి హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బాసరలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి 19 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భవిష్యత్లో ఆలయంలో వేద పాఠశాల, భక్తులకు ప్రసాద వితరణ, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణాన్ని నిజామాబాద్ నగరంలోని లలితా ఆశ్రమ ఆలయ (Lalita Ashram Temple) వ్యవస్థాపకులు దివంగత వేలేటి సుధాకర్ శర్మ కోరిక మేరకు భక్తులు, ప్రముఖుల సహకారంతో నిర్మించామన్నారు. సమావేశంలో ఆలయ ముఖ్య నిర్వాహకులు శ్వేలేటి రాజేందర్ శర్మ, మోటూరు వెంకటేశం, బచ్చు గోపాల్, సంతోష్, అభిషేక్, సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు.