Best Available Scheme
Best Available Scheme | బీఏఎస్ విద్యార్థుల నిధులు విడుదల చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Best Available Scheme | బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు మూడేళ్లుగా పెండింగ్​లో ఉన్న నిధులను విడుదల చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ (nizamabad Collectorate) ముందు పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (District Collector Vinay Krishna Reddy) వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై 12 రోజులు కావస్తున్నా పాఠశాల యాజమాన్యాలు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడాలని విన్నవించుకున్నారు. మూడేళ్లుగా రూ.కోట్లల్లో ప్రభుత్వం నుంచి పాఠశాలలకు బకాయిలు రావాలని.. ఇకనైనా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో సుమారు 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.