HomeUncategorizedBarack Obama | బ‌రాక్ ఒబామా అరెస్టు..! చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కాద‌న్న ట్రంప్‌

Barack Obama | బ‌రాక్ ఒబామా అరెస్టు..! చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కాద‌న్న ట్రంప్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాపై ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఓవల్ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేస్తున్నట్లు AIతో రూపొందించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ట్రుత్ లో పోస్టు చేశారు.

డెమోక్రాటిక్‌ పార్టీ నేత‌ల‌పై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే ఆయ‌న‌.. తాజాగా ఒబామా అరెస్టు వీడియోను పోస్టు చేస్తూ చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కాద‌ని పేర్కొన్నారు. అధ్యక్షుడు చట్టానికి అతీతుడు అని ఒబామా చెప్పడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది.

ఆ తర్వాత చాలా మంది అమెరికా రాజకీయ నాయకులు “ఎవరూ చట్టానికి అతీతులు కారు” అని పేర్కొంటున్నారు. ఒకప్పుడు అధ్యక్షుడిగా పని చేసిన ఓవ‌ల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో ఒబామా మాట్లాడుతున్న స‌మ‌యంలో FBI ఏజెంట్లు వ‌చ్చి ఆయ‌న చేతులకు సంకెళ్లు వేస్తూ, ట్రంప్ కాళ్ల ముంద‌ర కూర్చోబెట్టిన అనంత‌రం ఆయ‌య‌ను తీసుకుని వెళ్తారు. ఈ అరెస్టు సమయంలో ట్రంప్ కూర్చుని నవ్వుతూ ఉంటారు. ఒబామా జైలు లోపల ఓరెంజ్ క‌ల‌ర్ జంప్‌సూట్ ధరించిన‌ట్లు చూపించ‌డంతో ఈ వీడియో ముగుస్తుంది.

Barack Obama : వైర‌ల్‌గా మారిన వీడియో..

ఒబామా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అనేక మోసాల‌కు పాల్ప‌డ్డార‌ని ట్రంప్ ఆరోపించిన వారం రోజుల త‌ర్వాత ఈ వీడియోను పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. ట్రంప్ షేర్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే, దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. అధ్య‌క్షుడి చ‌ర్య బాధ్య‌తారాహిత్య‌మ‌ని పేర్కొంటున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన త‌ర్వాత ఆయ‌న‌ను నిరోధించడానికి ఒబామా, మాజీ అధికారులు ప్ర‌య‌త్నించార‌ని అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ర‌ష్యా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని పేర్కొన్నారు. ఒబామా పరిపాలనపై విచారణ చేప‌ట్టాల‌ని ఆమె డిమాండ్ చేశారు. “2016లో ట్రంప్ గెలిచాక‌, ఒబామా పరిపాలనలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు నిఘా వ్యవస్థను రాజకీయం చేసి ఆయుధాలుగా మార్చుకుని, ట్రంప్‌పై తిరుగుబాటుకు పునాది వేయడానికి ప్ర‌య‌త్నించారు.

వారు మన ప్రజాస్వామ్య గణతంత్రాన్ని దెబ్బతీసేందుకు ఎలా ప్రయత్నించారనే దాని గురించి అమెరికన్లు చివరకు నిజం తెలుసుకుంటారు” అని గ‌బ్బ‌ర్డ్‌ Xలో పేర్కొన్నారు.