అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sub-Collector : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఇన్ ఛార్జి ఆర్డీవోగా బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వహించిన మన్నె ప్రభాకర్ పదవీ విరమణ పొందారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్ ఛార్జి బాధ్యతలను కిరణ్మయి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.
