అక్షరటుడే, బాన్సువాడ: dog attack | పిచ్చికుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలపాలైన ఘటన బీర్కూర్ మండలం (Birkur mandal) బైరాపూర్ లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతులు మేకల బేతయ్య, మేకల సాయిలు, రాచకొండ భూమయ్యలతోపాటు మరికొందరు కూలీలు పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
