అక్షరటుడే, బాన్సువాడ : Banswada Polling Stations Inspection | ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Kamareddy Collector Ashish Sangwan) సూచించారు. ఈ మేరకు బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
Banswada Polling Stations Inspection | క్షుణ్ణంగా తనిఖీలు..
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితాలు, ఓటర్ కంపార్ట్మెంట్లు (Voter compartments), బ్యాలెట్ బాక్స్‌లు ఇతర ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రం లోపల, బయట భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రతి ఓటరు స్వేచ్ఛగా..
పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Banswada Government Degree College) ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎస్పీ రాజేష్ చంద్ర ఉన్నారు.