అక్షరటుడే, బాన్సువాడ : Banswada Police Action | పట్టణంలో అల్లర్లు సృష్టించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) హెచ్చరించారు. ఈ మేరకు బాన్సువాడ పోలీస్స్టేషన్ లో విలేకరులతో మాట్లాడారు.
Banswada Police Action | మాల్లో వాగ్వాదం..
పట్టణంలోని ఓ మాల్లో గురువారం సేల్స్గల్స్తో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడన్నారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందడంతో అతడిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం రాత్రి బాన్సువాడ పోలీస్స్టేషన్ (Banswada Police Station) ఎదుట రాళ్లు రువ్వుతూ హంగామా చేశారన్నారు. ఈ ఘటనలో తమ కానిస్టేబుల్కు గాయాలయ్యాయని తెలిపారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 42 మందిపై కేసులు నమోదు చేయబోతున్నామని తెలిపారు. అలాగే బాన్సువాడ బంద్ అంటూ కొందరు పిలుపునిచ్చారని.. సోషల్ మీడియాలో (Social Media) సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. వారిని సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే ఒకరిపై కేసు నమోదైందని.. మరికొందరిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
Banswada Police Action | పోలీసుల అదుపులో పట్టణం..
పట్టణంలో 144 సెక్షన్ పెట్టే అవసరం లేదని.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ తెలిపారు. అదనపు బలగాలను సైతం పట్టణానికి రప్పించామన్నారు. అలాగే ప్రజలు సైతం ఎలాంటి అపోహలకు గురికావద్దని.. సోషల్మీడియాలో వచ్చే స్టేటస్లను పట్టించుకోకుండా వారివారి పనులు చేసుకోవాలని సూచించారు. బాన్సువాడ బంద్ అంటూ కొందరు పిలుపునిచ్చారని వారిని సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే రాళ్లు రువ్విన వ్యక్తులకు సంబంధించిన సీసీ పుటేజీలు వీడియోలను మూడు బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని.. ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ చెప్పారు.