అక్షరటుడే, బాన్సువాడ: Banswada Municipality won by Congress | బాన్సువాడ మున్సిపాలిటీ (Banswada Municipality) ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఎంఐఎం 1, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. దీంతో కాసుల విజయ బాలరాజ్(Kasula Vijaya Balaraj) ఛైర్మన్గా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.
Banswada Municipality won by Congress | వార్డుల వారీగా వివరాలు ఇవే..
1వ వార్డు నాశ్రీన్ బేగం(బీఆర్ఎస్), 2వ వార్డు జంగం రాజశేఖర్( కాంగ్రెస్), 3వ వార్డు ఫకీం (కాంగ్రెస్), 4వ వార్డు రుక్మిణి (కాంగ్రెస్), 5వ వార్డు కాసుల విజయ బాలరాజు (కాంగ్రెస్), 6వ వార్డు అంజుం బేగం (బీఆర్ఎస్), 7వ వార్డు సామల మానస(బీజేపీ), 8వ వార్డు దొనకంటి శ్యామల( కాంగ్రెస్), 9వ వార్డు పాశం ఆమని(బీజేపీ), 10వ వార్డు ఎరుకల నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డు గడుముల లింగం (కాంగ్రెస్), 12వ వార్డు అంజా గౌడ్ (స్వతంత్ర), 13వ వార్డు ఖాలెక్ (కాంగ్రెస్), 14వ వార్డు నార్ల వసంత నందకిషోర్ (కాంగ్రెస్), 15వ వార్డు వాంకార్ రమేష్ (కాంగ్రెస్), 16వ వార్డు గజ్జల మహేష్(బీజేపీ), 17వ వార్డు ఫర్హనాస్( ఎంఐఎం),18వ వార్డు రేష్మ ఎజాజ్ (కాంగ్రెస్), 19వ వార్డు ఎండీ మక్బుల్ (బీఆర్ఎస్).
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..
బాన్సువాడ పట్టణంలోని (Banswada City) కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ పరిసరాల్లో పహారా కాశారు. అలాగే గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించారు.