అక్షరటుడే, బాన్సువాడ : Banswada Municipal Results | బాన్సువాడ మున్సిపాలిటీలో (Banswada Municipality) ఓట్ల లెక్కింపు ఉదయమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక బాన్సువాడ ఎస్ఆర్ఎన్కేలో కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనంతరం వార్డుల్లో ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.
Banswada Municipal Results | వార్డుల్లో విజేతలు వీరే..
12వ వార్డులో అంజా గౌడ్ (స్వతంత్ర అభ్యర్థి),18వ వార్డు రేష్మ ఎజాజ్ (కాంగ్రెస్), 16వ వార్డు గజ్జల మహేష్ (బీజేపీ), 16వ వార్డు గజ్జల మహేష్ (బీజేపీ) 11 ఓట్లతో విజయం సాధించారు. 1వ వార్డులో నస్రిన్ బేగం (బీఆర్ఎస్), 14వ వార్డులో నార్ల వసంత నందకిషోర్ (కాంగ్రెస్), 5వ వార్డు కాసుల విజయ బాలరాజ్, 7వ వార్డు సామల మానస (బీజేపీ), 10వ వార్డు ఎరుకల నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డు గడుముల లింగం ( కాంగ్రెస్), 2వ వార్డు జంగం రాజశేఖర్ (కాంగ్రెస్)చ 19వ వార్డు ఎండీ మక్బూల్ (బీఆర్ఎస్), బాన్సువాడ 6వ వార్డు అంజుం బేగం, 15వ వార్డు వంకార్ రమేష్ ( కాంగ్రెస్), 4వ వార్డు రుక్మిణి (కాంగ్రెస్) విజయం సాధించారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య..
కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం (Counting Center)లోని అనుమతించారు.
1 comment
[…] పట్టణంలోని (Banswada City) కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు […]
Comments are closed.