అక్షరటుడే, బాన్సువాడ: Banswada Municipal Chairperson Kasula Vijaya | బాన్సువాడ మున్సిపల్ (Banswada Municipality) పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేశారు.
Banswada Municipal Chairperson Kasula Vijaya | మొత్తం 19వార్డులకు గాను..
మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెరో 3 స్థానాలు గెలుచుకున్నాయి. అలాగే ఎంఐఎం పార్టీ ఒక స్థానం సాధించగా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో మున్సిపల్ ఛైర్పర్సన్గా కాసుల విజయ బాలరాజ్, వైస్ ఛైర్పర్సన్గా రేష్మా బేగం ఎజాజ్ ప్రమాణ స్వీకారం చేశారు.
సమష్టిగా అభివృద్ధికి కృషి చేయాలి..
ఈ సందర్భంగా విజయం సాధించిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub Collector Kiranmayi) మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు సమష్టిగా పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. నూతన పాలకవర్గం పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.