127
అక్షరటుడే, బాన్సువాడ : Banswada | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బాన్సువాడ మండలం ఆదర్శంగా నిలుస్తోంది. మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 10 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రజల పరస్పర అవగాహనతో ఈ పంచాయతీలు (Panchayats) పోటీ లేకుండా ఎన్నికలను ముగించాయి.
Banswada | ఏకగ్రీవమైన పంచాయతీలివే..
పోచారం (Pocharam), చిన్న రాంపూర్, కొయ్యగుట్టతండా, పులిగుండు తండా, సోమ్లానాయక్ తండా, రాంపూర్ తండా, ఇబ్రహీంపేట్ తండా, పుల్ కుచ్ తండా, బోర్లం క్యాంపు తండా, జక్కల్ దాని తండా ఏకగ్రీవామయ్యాయి.