అక్షరటుడే, బాన్సువాడ: Alumni Friends | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విధులకు వెళ్తున్న క్రమంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ (MIS Coordinator) రాజేష్ జూన్ 30న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి ఆర్థికసాయం చేసేందుకు బాన్సువాడ ఉపాధ్యాయులు (Banswada Teachers) ముందుకొచ్చారు.
ఉపాధ్యాయులంతా కలిసి వాట్సాప్ గ్రూప్‌లో (WhatsApp group) ఆర్థికసాయం అందించే విషయాన్ని పోస్ట్ చేశారు. 24 గంటల్లో 90 మంది ఉపాధ్యాయులు దీనికి స్పందించారు. రూ. 51,073 జమ చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకంపాలెంకు (Ankampalem) మండల విద్యాధికారి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు మంద ప్రవీణ్, దాసరి రవీందర్, నాగార్జున్, ఏంఐఎస్ కో-ఆర్డినేటర్ భాను ప్రసాద్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. రాజేష్ కుమారుడి పేరిట పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలు అందజేశారు.
Read all the Latest News on Aksharatoday.in