అక్షరటుడే, ఇందూరు : Bansal Students JEE Results | జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో (JEE Mains Results) నిజామాబాద్ బన్సల్ జూనియర్ కాలేజీ (Nizamabad Bansal Junior College) విద్యార్థులు ప్రతిభ కనబర్చారని కళాశాల డైరెక్టర్ మేకల లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు ప్రతిభ దాటిన విద్యార్థులకు మంగళవారం కళాశాలలో అభినందించారు.
Bansal Students JEE Results | కళాశాల విద్యార్థులు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థి రవితేజ 96.66 శాతం, ఆకుల శ్రీహర్ష 99.47 పర్సంటేజీ, నరసింహ 91.66 శాతం, త్రిష 89.21శాతం సాధించారని పేర్కొన్నారు. కళాశాల స్థాపించిన రెండో సంవత్సరంలోనే అద్భుతమైన విజయాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. కళాశాల అధ్యాపకుల అనుభవం కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర నగరాలకు పట్టణాలకు పంపే అవసరం లేకుండా నిజామాబాద్‌లోనే (Nizamabad)నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యావేత్త నరాల సుధాకర్, కళాశాల కో డైరెక్టర్ జమున, అధ్యాపకులు అభిషేక్ తివారి, సురేంద్ర గోయల్, మనీష్ తివారి తదితరులు పాల్గొన్నారు.