అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bank holidays | అక్టోబర్(October)లో చాలా పండుగలు వస్తున్నాయి. దసరాతో పాటు దీపావళి(Diwali) పండగలు అక్టోబర్ నెలలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయుధ పూజ, విజయదశమి (Vijayadasami), దుర్గా పూజ, గాంధీ జయంతి, లక్ష్మీ పూజ, మహర్షి వాల్మీకి జయంతి, కర్వా చౌత్, బిహూ, దీపావళి, నరక చతుర్దశి, గోవర్ధన్ పూజ, భాయ్‌దూజ్, చత్ పూజ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వంటివి ఉన్నాయి.
అన్ని పండగలు అన్ని రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఉండవు. ప్రాంతీయ సెలవుల ఆధారంగా కూడా సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కాగా బ్యాంకులకు సంబంధించిన సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖరారు చేస్తుంటుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 19 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు.. తెలంగాణ(Telangana)లో మాత్రం ఎనిమిది రోజులు సెలవులు వచ్చాయి. బ్యాంకులకు సెలవులు ఉన్నా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.
- అక్టోబర్ 2 : దసరా, గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
- అక్టోబర్ 5 : ఆదివారం
- అక్టోబర్ 11 : రెండో శనివారం
- అక్టోబర్ 12 : ఆదివారం
- అక్టోబర్ 19 : ఆదివారం
- అక్టోబర్ 20 : దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని
- బ్యాంకులకు సెలవు.
- అక్టోబర్ 25 : శనివారం
- అక్టోబర్ 26 : ఆదివారం