అక్షరటుడే, వెబ్డెస్క్ : Bank Holidays | ఆగస్టులో మూడు వారాలే బ్యాంకులు పనిచేయనున్నాయి. మిగతా రోజులలో సాధారణ సెలవులతోపాటు ప్రత్యేక సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ప్రతినెలా హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తుంది. ఈనెలలో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లలో ఏకంగా పది రోజులపాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
బ్యాంకులకు ప్రతి ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయి. అలాగే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా సెలవు ఉంటుంది. ఈనెలలో ఐదు ఆదివారాలు వచ్చాయి. స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి (Krishnastami), వినాయక చవితి పండుగలు కూడా ఉన్నాయి. ఈ పది సెలవులు పోగా మిగిలిన 21 రోజులు బ్యాంకులు తెరిచి ఉంటాయి. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి ఎప్పటిలాగే కొనసాగుతాయి.
బ్యాంక్ హాలిడేస్(Bank holidays) లిస్ట్..
ఆగస్టు 3 : ఆదివారం
ఆగస్టు 9 : రెండో శనివారం, రక్షాబంధన్
ఆగస్టు 10 : ఆదివారం
ఆగస్టు 15 : శుక్రవారం (స్వాతంత్య్ర దినోత్సవం)
ఆగస్టు 16 : శనివారం (శ్రీకృష్ణ జన్మాష్టమి)
ఆగస్టు 17: ఆదివారం
ఆగస్టు 23 : నాలుగో శనివారం
ఆగస్టు 24 : ఆదివారం
ఆగస్టు 27 : బుధవారం (వినాయక చవితి)
ఆగస్టు 31 : ఆదివారం