అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bank Holidays | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) దేశంలోని బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. నవంబర్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితా విడుదలయ్యింది.
దీని ప్రకారం.. తెలంగాణలోని (Telangana) బ్యాంకులు వచ్చేనెలలో 22 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. మిగిలిన ఎనిమిది రోజులు సెలవులు.. అయితే బ్యాంకులకు సెలవులు (Bank Holidays) ఉన్నా.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలతోపాటు ఏటీఎం సేవలు ఎప్పటిలాగే కొనసాగనున్నాయి.
బ్యాంకుల సెలవుల జాబితా..
- నవంబర్ 2 : ఆదివారం
- నవంబర్ 5 (బుధవారం): గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 8 : రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 9: ఆదివారం
- నవంబర్ 16: ఆదివారం
- నవంబర్ 22: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 23 : ఆదివారం
- నవంబర్ 30: ఆదివారం
- వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పండుగలకు సెలవులు ఉండనున్నాయి. దీని ప్రకారం నవంబర్ 1న కర్ణాటక(Karnataka) రాజ్యోత్సవ సందర్భంగా ఆ రాష్ట్రంలో, ఉత్తరాఖండ్‌లో ఇగాస్- బగ్వాల్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 7 న మేఘాలయాలో (Meghalaya) వంగల పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- నవంబర్ 11 న లహాబ్ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని (Sikkim) బ్యాంకులకు సెలవు.
 నవంబర్ 25 న గురు తేజ్ బహదూర్ బలిదాన దినోత్సవం (అమర వీరుల దినోత్సవం) సందర్భంగా పంజాబ్ (Punjab), హర్యానాతోపాటు ఛండీగఢ్‌లోని బ్యాంకులకు సెలవు.

