- Advertisement -
HomeUncategorizedICICI Bank | ఖాతాదారుల సొమ్ము స్టాక్​ మార్కెట్​లోకి.. బ్యాంక్​ అధికారిణిని అరెస్ట్​ చేసిన పోలీసులు

ICICI Bank | ఖాతాదారుల సొమ్ము స్టాక్​ మార్కెట్​లోకి.. బ్యాంక్​ అధికారిణిని అరెస్ట్​ చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ICICI Bank | ఇంట్లో డబ్బులు పెడితే దొంగల భయం.. ఎక్కడైనా ఇన్వెస్ట్​ చేద్దామంటే రిస్క్​ ఉంటుందనే ఆందోళన. దీంతో చాలా మంది తమ డబ్బులను బ్యాంకుల్లో ఫిక్స్​డ్​ డిపాజిట్(Fixed Deposit)​ చేసుకుంటారు. ఇలా అయితే తమ డబ్బులు భద్రంగా ఉంటాయని భావిస్తారు. కానీ కొందరు బ్యాంకు అధికారుల(Bank officers) తీరుతో ఖాతాదారుల డబ్బుకు భద్రత లేకుండా పోయింది. బ్యాంక్​లోని ఖాతాదారుల డబ్బులను రక్షించాల్సిన అధికారులే.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని నొక్కేస్తున్నారు. ఇలా బ్యాంకు నుంచి రూ.4.58 కోట్లు కాజేసిన ఓ అధికారిణిని పోలీసులు అరెస్ట్(Police Arrest)​ చేశారు.

ICICI Bank | స్టాక్ మార్కెట్​లో నష్టపోవడంతో..

రాజస్థాన్‌(Rajasthan)లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో సాక్షి గుప్తా రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె స్టాక్​ మార్కెట్​లో డబ్బులు పెట్టి భారీగా లాభాలు గడించాలని ఆశించింది. అందుకోసం బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసిన ఖాతాదారుల నగదు వాడుకుంది. 40 మందికిపైగా కస్టమర్లకు చెందిన రూ.4.58 కోట్లను అక్రమంగా వాడుకుంది. ఆ డబ్బును స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయగా.. నష్టం వచ్చింది. దీంతో ఆ డబ్బును తిరిగి జమ చేయలేకపోయింది. ఓ వ్యక్తి తన ఫిక్స్​డ్​ డిపాజిట్(Fixed Deposit)​ గురించి ఆరా తీయడానికి బ్యాంకుకు వెళ్లగా ఈ స్కామ్​ వెలుగు చూసింది. దీంతో బ్యాంకు అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News