ePaper
More
    Homeబిజినెస్​Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    Stock market | నాలుగో రోజూ లాభాల్లోనే.. ఆల్‌టైం హైలో బ్యాంక్‌ నిఫ్టీ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) ఆల్‌టైం హై దిశగా అడుగులు వేస్తున్నాయి. ఐటీ, రియాలిటీ మినహా మిగతా అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం 19 పాయింట్ల స్వల్ప లాభంతో సెన్సెక్స్‌, 27 పాయింట్ల లాభంతో నిఫ్టీ(Nifty) ప్రారంభమయ్యాయి. కొద్దిసేపు లాభనష్టాల మధ్య ఊగిసలాడినా ఆ తర్వాత స్థిరంగా పైకి ఎగబాకాయి. చివరికి ఇంట్రాడే గరిష్టాలకు చేరువలో సెన్సెక్స్‌(Sensex) 303 పాయింట్ల లాభంతో 84,058 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 25,637 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీ రికార్డుస్థాయికి చేరింది. ఇంట్రాడేలో 57,475 పాయింట్లకు చేరిన బ్యాంక్‌ నిఫ్టీ.. చివరికి 57,443 వద్ద నిలిచింది.

    బీఎస్‌ఈ(BSE)లో 2,251 కంపెనీలు లాభపడగా 1,760 స్టాక్స్‌ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 164 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 52 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. డాలర్‌ బలహీనపడడం, భారత్‌(Bharath) – అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ దిశగా అడుగులు పడుతుండడంతో ఇన్వెస్టర్లు ఆశావహ దృక్పథంతో మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌ నాటికి ఒప్పందం ఖరారు కావొచ్చని తెలుస్తోంది.

    Stock market | రాణించిన ఆయిల్‌, పవర్‌ సెక్టార్ల షేర్లు..

    రియాలిటీ(Realty), ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.21 శాతం, సర్వీసెస్‌ 1.17 శాతం, పవర్‌ 1.14 శాతం, కమోడిటీ 1.11 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 1.10 శాతం, టెలికాం ఇండెక్స్‌ 0.90 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.57 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.34 శాతం పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.54 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.44 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.38 శాతం లాభాలతో ముగిశాయి.

    Stock market | Top gainers..

    బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో హిమాద్రి స్పెషాలిటీ(Himadri speciality) 11.93 శాతం, ఎల్‌టీ ఫుడ్స్‌ 9.92 శాతం, నారాయణ హృదయాలయ 9.63 శాతం, రెడిరగ్టన్‌ 7.97 శాతం, కోరొమాండల్‌ ఇంటర్నేషనల్‌ 7.53 శాతం పెరిగాయి.

    Stock market | Top losers..

    టీడీ పవర్‌ సిస్టమ్స్‌(TD power systems) 6.43 శాతం, కొహాన్స్‌ లైఫ్‌సైన్సెస్‌ 5.79 శాతం, ఎజిస్‌ లాజిస్టిక్స్‌ 5.06 శాతం, టార్క్‌(టీఏఆర్‌సీ) 4.04 శాతం, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌ 3.89 శాతం నష్టపోయాయి.

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...