అక్షరటుడే, బాన్సువాడ: Union Bank Employee | కొంతకాలంగా పని ఒత్తిడితో (work pressure) మానసిక ఆందోళనకు గురైన బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహమ్మద్‌నగర్‌లో చేటు చేసుకుంది. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మహమ్మద్ నగర్ యూనియన్ బ్యాంకులో (Muhammadnagar Union Bank) అసిస్టెంట్ మేనేజర్‌గా కస్తూరి సంగమేశ్వర్ పనిచేస్తున్నాడు.
Union Bank employee | తీవ్ర ఒత్తిడికి లోనై..
అయితే కొంత కాలంగా ఆయన పనిఒత్తిడి కారణంగా మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రోజూ మాదిరిగానే విధులకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికారు. చివరకు బాన్సువాడ మండలం (Banswada mandal) మొగలాన్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. పని ఒత్తిడితో జీవితం మీద విరక్తి చెంది ఉరివేసుకుని మృతి చెందాడని మృతుడి భార్య వైశాలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.