అక్షరటుడే, బోధన్: Bodhan | బంజార సంఘం బోధన్ పట్టణ, మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండలంలోని బెల్లాల్ తండా సేవాలాల్ మహారాజ్ ఆలయంలో (Sewalal Maharaj Temple) కాట్రోత్ మున్ని నాయక్, తండాల నాయక్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా దూప్‌సింగ్, ప్రవీణ్ నాయక్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విశ్వనాథ్ నాయక్, విస్లావత్ శ్రీనునాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తారాచంద్ నాయక్, గణేష్ నాయక్, సంజీవ్ నాయక్, తండావాసులు పాల్గొన్నారు.
