అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh team : ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు (Bangladesh cricket team) సిద్ధం అయింది. 16 మంది సభ్యుల జట్టును ఆ దేశం ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ (Liton Das) నాయకత్వం వహించనున్నాడు.
బంగ్లాదేశ్ ఆ దేశ జట్టును శుక్రవారం (ఆగస్టు 22) 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు రాబోయే ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆడనుంది.
కాగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) ప్రకటించిన జట్టు.. ఆసియా కప్‌కు ముందు మరో సిరీస్ ఆడనుంది. నెందర్లాండ్(Netherlands)తో T20I సిరీస్‌లో తలపడనుంది. ఇందులో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మేరకు ICC వెబ్‌సైట్ (ICC website) తెలిపింది.
సుమారు మూడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ T20I జట్టులోకి వికెట్ కీపర్-బ్యాటర్ క్వాజీ నూరుల్ హసన్ సోహన్ (Wicketkeeper-batsman Quazi Nurul Hasan Sohan) తిరిగి వస్తున్నాడు. 31 ఏళ్ల నూరుల్ చివరిసారిగా 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో పాల్గొన్నాడు.
ఆసియాలోని అత్యుత్తమ జట్లతో కూడిన ఎనిమిది జట్ల టోర్నమెంట్ (tournament) ఆసియా కప్. తాజాగా ప్రకటించిన బంగ్లాదేశ్ జట్టు ఈ ఆసియా కప్‌లో ఆడబోతోంది. తద్వారా వచ్చే ఏడాది ICC పురుషుల T20 ప్రపంచ కప్ వైపు బంగ్లాదేశ్ జట్టు ప్రయాణంలో కీలకమైన అడుగుగా ఉండబోతోంది.
Bangladesh team : వేదిక యూఏఈ
ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబరు 9 నుంచి 28 వరకు జరగబోతోంది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
ఆసియా కప్ ఈవెంట్ T20I ఫార్మాట్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది భారతదేశం, శ్రీలంకలో ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఉంది. దానికి ముందు ఈ ఆసియా కప్ జరుగుతోంది. అంటే దీనివల్ల ఈ జట్లకు ఆసియాకప్ సన్నాహకంగా టోర్నీగా ఉండబోతుందన్నమాట.
మొదటి మ్యాచ్..
Asia Cup–2025 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ సెప్టెంబరు 9న ఆఫ్ఘనిస్తాన్ – హాంకాంగ్ మధ్య జరుగుతుంది.
గ్రూప్ –ఏ లో..
భారతదేశం, పాకిస్తాన్, UAE, ఒమన్ గ్రూప్ Aలో ఉన్నాయి.
గ్రూప్ – బీ లో..
శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ Bలో ఉన్నాయి.
Bangladesh team : ఇక బంగ్లాదేశ్ విషయంలో..
ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ సెప్టెంబరు 11న అబుదాబిలో హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
భారత్(India), పాకిస్తాన్(Pakistan), బంగ్లాదేశ్(Bangladesh) మాత్రమే తమ జట్లను ప్రకటించాయి. మిగతా దేశాలు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. కాగా ఇది T20 ఆసియా కప్ యొక్క మూడో ఎడిషన్. 2016లో భారత్ ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకుంది. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.
బంగ్లాదేశ్ ఆసియా కప్ జట్టు(Bangladesh Asia Cup squad): లిట్టన్ దాస్ (సి), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ అనిక్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షక్ మహేదీ హసన్, ముస్తుమ్, రిషద్ హుస్సేన్, రజాన్ అహ్మద్, నసుమ్ తాజ్కి, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్.