HomeUncategorizedBangladesh | కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్

Bangladesh | కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangladesh | పాక్ pak​పై దాడి చేస్తే భారత్​లోని ఈశాన్య రాష్ట్రాలను Northeastern states ఆక్రమించుంటుందట బంగ్లాదేశ్ bangladesh. తమ దేశం ఏర్పాటు కావడానికి కారణమైన భారత్​తో సఖ్యతగా ఉండాల్సిన బంగ్లాదేశ్​ మన పట్ల విషం చిమ్ముతోంది. తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ Muhammad Yunus నేతృత్వంలోని బంగ్లా మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్​పై పాక్​పై దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ఆ దేశానికి చెందిన రిటైర్డ్​ మేజర్​ వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రదాడి PahalgamTerror attack తర్వాత భారత్​– పాక్​ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రెండు దేశాలు యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా న్యూఢిల్లీ పాకిస్తాన్​పై దాడి చేస్తే బంగ్లాదేశ్.. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ఆ దేశానికి చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ ALM ఫజ్లుర్ రెహమాన్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్​కు అత్యంత సన్నిహితుడిగా రెహమాన్​కు పేరుంది. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకునేందుకు చైనా సహకారం కోరాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక ఏర్పాటుపై చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను” అని రెహమాన్ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు.

Bangladesh | భారత్​పై బంగ్లా అక్కసు

బంగ్లాదేశ్​లో అంతర్యుద్ధం తర్వాత మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పారిపోవడంతో ఆ దేశంలో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. హసీనా భారత్​లో ఆశ్రయం పొందుతుండగా, యూనస్ ప్రభుత్వం మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశంలోని హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా కనీసం స్పందించలేదు. మరోవైపు, యూనస్ కూడా ఇటీవల భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. మార్చిలో చైనా పర్యటన సందర్భంగా ముహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాలపై తిక్క వ్యాఖ్యలు చేశారు.

Must Read
Related News