Homeక్రీడలుAsia Cup | పోరాడే ల‌క్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచిన హాంకాంగ్.. అయిన‌ప్ప‌టికీ..!

Asia Cup | పోరాడే ల‌క్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచిన హాంకాంగ్.. అయిన‌ప్ప‌టికీ..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ విజయవంతమైన ఆరంభాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.

కెప్టెన్ లిటన్ దాస్(Captain Liton Das) (39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన హాంగ్‌కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ యసిమ్ ముర్తాజా (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జీషన్ అలీ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), నిజకత్ ఖాన్ (40 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టుకు అవ‌స‌ర‌మైన‌ ఇన్నింగ్స్ ఆడారు.

Asia Cup | మ‌రో ఓట‌మి..

బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ , తంజీమ్ హసన్ షకీబ్ , రిషద్ హొస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. లక్ష్యాన్ని బంగ్లాదేశ్(Bangladesh) 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ లిటన్ దాస్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి 95 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. టౌహిడ్ హృదయ్ (36 బంతుల్లో 35 నాటౌట్) చివరి వరకు నిలిచి విజయాన్ని పూర్తి చేశాడు. ఓపెనర్లు పర్వేజ్ హోస్సేన్ (19), తంజిద్ హసన్ (14) త్వరగానే ఔటైనప్పటికీ, లిటన్-హృదయ్ జోడీ జట్టుని విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. లిటన్ దాస్ బౌల్డ్ అవ్వగానే భాగస్వామ్యానికి తెర పడినా, టౌహిడ్ హృదయ్ – జాకెర్ అలీ (0 నాటౌట్) జట్టును విజయానికి చేర్చారు.

హాంగ్‌కాంగ్ (Hong Kong) తరఫున అయుష్ శుక్లా , అతీక్ ఇక్బాల్ చెరో వికెట్ తీశారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హాంగ్‌కాంగ్ సూపర్-4 రేసు నుంచి దాదాపు తప్పుకుంది. ఇక చివ‌రి మ్యాచ్‌లో శ్రీలంకను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో దాదాపు గెల‌వ‌క‌పోవ‌చ్చు. గెలిచిన కూడా సిరీస్ నుండి దాదాపు త‌ప్పుకున్న‌ట్టే. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హాంగ్ కాంగ్ కి ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ క్ర‌మంలో పవర్ ప్లేలో హాంగ్ కాంగ్ 2 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. వంద లోపే ఆలౌట్ అవుతార‌ని అనుకున్నారు కాని ఎట్ట‌కేలకి 144 ప‌రుగులు చేశారు.

Must Read
Related News