అక్షరటుడే, వెబ్డెస్క్: female pm khaleda zia | బంగ్లాదేశ్ Bangladesh రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన, దేశ తొలి మహిళా ప్రధానమంత్రి బేగమ్ ఖలీదా జియా ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఖలీదా జియా khaleda zia (80) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమెకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధికారికంగా ప్రకటించింది. మన ప్రియమైన నేత బేగమ్ ఖలీదా జియా ఇక లేరు. ఫజర్ ప్రార్థనలు ముగిసిన కొద్ది సేపటికే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు అని బీఎన్పీ ఫేస్బుక్ పేజీ ద్వారా వెల్లడించింది. ఆమె మృతితో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
female pm khaleda zia | ఒక శకం ముగిసింది..
వైద్యుల సమాచారం ప్రకారం ఖలీదా జియా khaleda zia అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు అడ్వాన్స్డ్ లివర్ సిర్రోసిస్, ఆర్థిరైటిస్, డయాబెటిస్తో పాటు గుండె, ఛాతీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు, ఆర్మీ కమాండర్ జియౌర్ రహ్మాన్ భార్య. రాజకీయాల్లోకి వచ్చిన ఆమె రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 1991లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి, దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2001 నుంచి 2006 వరకు మరోసారి ప్రధానిగా కొనసాగారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాకు Haseena అత్యంత బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఖలీదా జియా పేరు గాంచారు. అయితే ఆమె రాజకీయ జీవితం వివాదాలకు కూడా అతీతం కాదు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఖలీదా జియా, 2008కి సంబంధించిన ఓ అవినీతి కేసులో దోషిగా కూడా తేలారు. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. తీవ్ర అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2020లో షేక్ హసీనా ప్రభుత్వం ఖలీదా జియా జైలు శిక్షను సస్పెండ్ చేసింది. అయితే దేశం విడిచి వెళ్లకూడదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని షరతులు విధించింది. ఈ ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత ఖలీదా జియా హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చారు. ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక యుగానికి తెరపడినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.